
గల్లంతైన ఇద్దరు మహిళలు శవాలుగా..
● మరో మహిళ కోసం గాలింపు
జగిత్యాలక్రైం: మహారాష్ట్రలో జరిగిన ఓ వివాహ వేడుకల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో కారులో ప్రయాణిస్తున్న జగిత్యాల శివారు టీఆర్‌నగర్‌కు చెందిన ముగ్గురు మహిళలు ఆదివారం గల్లంతయిన విషయం తెల్సిందే. మంగళవారం ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యమయ్యాయి. షేక్ అఫ్రిన (30), సమీన (50), హసీన (28)తోపాటు వారి బంధువు, ఆర్మూర్‌కు చెందిన సోహెబ్ కలిసి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముక్హేడ్ తాలూకా దెగ్లూర్ వెళ్లి తిరిగి వస్తుండగా రవిగాం వద్ద వరదలో గల్లంతయ్యారు. భారీ వరదల్లో కారు కొట్టుకుపోయింది. అక్కడి గ్రామస్తులతో పాటు, రెస్క్యూ టీం, పోలీసు బలగాలు గాలింపు చర్యలు చేపట్టగా హసీన, అఫ్రిన్ మృతదేహాలు దొరికాయి. సమీన మృతదేహం కోసం గాలిస్తున్నారు. మృతదేహాలను అక్కడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి తీసుకురానున్నారు.
అఫ్రిన (ఫైల్)
హసీన (ఫైల్)

గల్లంతైన ఇద్దరు మహిళలు శవాలుగా..