
అంజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
మల్యాల: కొండగట్టు అంజన్న ఆలయం మంగళవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చి.. కోనేరులో స్నానాలు చేశారు. క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. సామూహిక ఆంజనేయస్వామి అభిషేకాల్లో పాల్గొన్నారు. లడ్డూ, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.6లక్షలు, ప్రత్యేక దర్శనం టికెట్ల విక్రయాల ద్వారా రూ.4.12 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల ఏర్పాట్లను ఆలయ ఈఓ శ్రీకాంత్ రావు, చంద్రశేఖర్, సునీల్‌కుమార్, హరిహరనాథ్, అశోక్, తదితరులు పర్యవేక్షించారు.