
ప్రతిభ చాటాలి
పాఠశాలస్థాయిలో విద్యార్థులకు క్రీడావేదికగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలు ఎంతగానో దోహదపడుతున్నాయి. రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ క్రీడల్లో విద్యార్థులు ప్రతిభ చాటాలి. ప్రతీ ఏడాది ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయస్థాయి ఎస్జీఎఫ్ టోర్నీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి ప్రతిభ కనబరిచి ఉమ్మడి జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తున్నారు. ఈ సంవత్సరం మరింత మెరుగ్గా రాణించి పతకాలు తీసుకురావాలి.
– గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి