
ఎరువులు ఏవైనా.. కంపెనీ ఏదైనా..
వానాకాలంలో వినియోగించనున్న రసాయన ఎరువులు (మెట్రిక్ టన్నుల్లో)
ధరలు ఇలా.. (రూ.లలో)
బడా కంపెనీల ప్రచారానికి తెర
ధరల స్థిరీకరణ.. అన్నదాతల్లో ఆనందం
ఎరువులు సకాలంలో అందితేనే ప్రయోజనం
ఒకే రంగులో మందు బస్తా
కరీంనగర్‌అర్బన్: రసాయనిక ఎరువుల బస్తా రూపు మారింది. బస్తాపై ఉన్న వివరాలూ మారా యి. దాంతో పాటే ఎరువు తయారీ చేయడానికి కంపెనీకి ఇచ్చిన రాయితీ ఎంత అనేది కూడా బస్తాపై కనబడుతోంది. ఎరువులు ఏవైనా, కంపెనీ ఏదైనా సరే బస్తా మాత్రం ఒకే రంగులో ఉండనున్నాయి. ఏ రకానికి చెందిన రసాయనిక ఎరువు అన్న వివరాలు సైతం ఓకే రకమైన రంగుతో కనిపించడం రైతులకు శుభపరిణామం. కేంద్రం ద్వారా రాయితీలు పొంది ఎరువులను డీలర్లకు సరఫరా చేసే ఏ కంపెనీ అయినా సరే ఈ విధానం అమలు చేయాల్సిందేనని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో కంపెనీలు డీలర్లకు మునుపటిలా కాకుండా ఎరువుల బస్తాను విభిన్నమైన రంగులో ముద్రించి సరఫరా చేస్తున్నాయి. బస్తాపై రాయితీ వివరాలు పెద్ద అక్షరాలతో కనిపిస్తున్నాయి. కంపెనీల పేరు, సింబల్ సైజు బాగా తగ్గింది.
కంపెనీల ప్రచారానికి తెర
వివిధ కంపెనీలు ఎరువుల రాయితీ పొంది నిర్దేశిత ధరకు కాకుండా అధిక ధరలకు విక్రయస్తూ వస్తున్నాయి. దీన్ని గుర్తించిన కేంద్రం కంపెనీలు పాల్పడుతున్న అక్రమాలను అరికట్టేందుకు ఎరువుల బస్తాలను ఇలా కొత్త డిజైన్లోకి తీసుకొచ్చింది. గతంలో కంపెనీలు తమ పేరుతో ఎరువుల బస్తాలపై ముద్రణను ప్రచారంగా వాడుకొనేవి. రాయితీ వివరాలు ఎక్కడా కనిపించేవి కావు. వివిధ ఎరువులను అధిక ధరలకు మార్కెట్లో విక్రయిస్తూ వచ్చా యి. కంపెనీల అక్రమాల కారణంగా ఎరువుల సబ్సిడీ అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం గతేడాదే నిర్ణయం తీసుకున్నా ఈ ఏడాది నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చింది. దీంతో బస్తా మధ్యలో ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వారక్ పరియోజన అని ముద్రించి ఉంది. కంపెనీల బస్తాలన్నీ ఒకేలా ఉండనున్నాయి. కంపెనీలతో సంబంధం లేకుండా యూరియా బస్తాలన్నీ ఒక రంగులో, డీఏపీ బస్తాలు మరో ప్రత్యేక రంగులో మార్కెట్లోకి వచ్చాయి.
ధరల నియంత్రణ.. పారదర్శకత
అన్ని ఎరువుల బస్తాలు ఒక్కో రంగులో, ముఖ్యంగా రాయితీ వివరాలు ఉండటం వల్ల విక్రయాల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. దాంతో పాటే కంపెనీలు సైతం కచ్చితంగా ధరల నియంత్రణ పాటించడం తప్పనిసరి. ఒక్కో ఎరువు ఒక్కోరంగులో అందుబాటులోకి వచ్చాయి. కొన్ని కంపెనీల వద్ద ఎరువులు నిల్వ ఉండడం వల్ల వాటి విక్రయాలు పూర్తి కాగానే కొత్తగా తయారయ్యే ప్రతీ ఎరువు బస్తా ఇక ముందు కొత్తగా అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారమే మార్కెట్లో కనిపించనుంది.
యూరియా 43,637
డీఏపీ 7,412
ఎంవోపీ 6,375
కాంప్లెక్స్ 20,627
ఎస్‌ఎస్‌పీ 1,000
కంపోస్ట్ 550
డీఏపీ 1,350
20:20:0:13 1,175
ఎస్‌ఎస్‌పీ 540
ఇతర 1,200