
‘మీట్ అండ్ గ్రీట్’లో శాతవాహన వీసీ
కరీంనగర్‌క్రైం: శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఉమేశ్‌కుమార్ ఆమెరికాలోని బోస్టన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన మేధావులతో కలిసి ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ, తెలంగాణలో విద్య యొక్క పాత్ర, యూనివర్సిటీల బాధ్యతల గూర్చి వివరించారు. యూనివర్సిటీల్లోని మౌలిక, సాంకేతిక సదుపాయాలు, అవసరాల పై వెల్లడించారు. విద్య, యూనివర్సిటీ అభివృద్ధి అంశాలపై సుదీర్ఘంగా చర్చించి వారి సలహాలు స్వీకరించారు. అక్కడి ప్రముఖులు జంధ్యం దివాకర్, మారోజు వెంకట్, మంతెన రాయదాసు, పలువురు పాల్గొన్నారు. అనంతరం శాతవాహన యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ ట్రస్ట్‌ను బలోపేతం చేయాలని సూచించారు.