బేతిగల్‌కు అధికారులు | - | Sakshi
Sakshi News home page

బేతిగల్‌కు అధికారులు

Aug 19 2025 4:40 AM | Updated on Aug 19 2025 5:24 AM

● జాండీస్‌ బాధితుల వివరాలు సేకరించిన డీఎంహెచ్‌వో ● నీటి శాంపిల్స్‌ సేకరణ

వీణవంక: మండలంలోని బేతిగల్‌ గ్రామంలో జాండీస్‌ వ్యాధితో గ్రా మస్తులు బాధపడుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం క దిలింది. జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, బ్యాక్టీర్యాలోజిస్ట్‌ పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబరేటరి వరంగల్‌ రీజియన్‌ అధికారి డాక్టర్‌ కృష్ణారావు, డెప్యూటీ డీఎంహెచ్‌వో చందు, ఎంపీవో, మిషన్‌ భగరీథ ఏఈలు క్షేత్రస్థాయిలో పర్యటించారు. వ్యాధితో పాటు, జ్వరాలు వస్తుండటంతో గ్రామస్తులు ఆసుపత్రుల పాలవుతున్న తీరుపై ఆదివారం సాక్షిలో శ్రీబేతిగల్‌కు జాండీస్‌శ్రీ కథనం ప్రచురితమైంది. ఈక్రమంలో డీఎంహెచ్‌వో బాధితుల ఇళ్లకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన క్యాంపును పరిశీలించి వైద్యులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని, జాండీస్‌కు నూనే పదార్థాలు తినకూడాదని గ్రామస్తులకు సూచించారు. వారం రోజుల పాటు గ్రామంలో హెల్త్‌ క్యాంపు నిర్వహిస్తామని, గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

తాగునీటి శ్యాంపిల్స్‌ సేకరణ

వరంగల్‌ రీజియన్‌ బ్యాక్టీర్యాలోజిస్ట్‌ ల్యాబరేటరీ అ ధికారి కృష్ణారావు గ్రామంలో పర్యటించి బాధితుల వివరాలు సేకరించారు. గ్రామంలోని వాటర్‌ ప్లాంట్‌, మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంకులను పరిశీలించి నీటి శాంపిళ్లను సేకరించారు. వీటిని ల్యాబ్‌కు పంపించి పరీక్షలు జరుపుతామని తెలిపారు. వాటర్‌ ట్యాంకులను క్లోరినేషన్‌ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్లోరైడ్‌ ఎక్కువగా ఉందని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీవో సురేందర్‌ గ్రామంలో పర్యటించి శానిటేషన్‌ చేయించారు. డ్రైయినేజీలు, మురుగునీరు ఉన్న ప్రాంతాల్లో బ్లీచింగ్‌ చేయించారు. భగీరథ ఏఈలు శ్రీనివాస్‌, రాముతో పాటు ల్యాబ్‌ సిబ్బంది వాటర్‌ నమూనాలను సేకరించారు. కార్యక్రమంలో హెల్త్‌ ఎడ్యూకేటర్‌ పంజాల ప్రతాప్‌, డాక్టర్‌ వరుణ, ల్యాబ్‌ సిబ్బంది సురేశ్‌, మధు, గ్రిడ్‌ సూపర్‌వైజర్‌ శ్రీనివాస్‌ రాజేంద్రప్రసాద్‌, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

బేతిగల్‌కు అధికారులు 1
1/2

బేతిగల్‌కు అధికారులు

బేతిగల్‌కు అధికారులు 2
2/2

బేతిగల్‌కు అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement