
మంగళవారం శ్రీ 19 శ్రీ ఆగస్టు శ్రీ 2025
న్యూస్‌రీల్
పాపన్న
ఆశయాలు కొనసాగిద్దాం
సామాజిక సమానత్వానికి కృషి చేసిన సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో పాపన్న 375వ జయంతిని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాపన్న చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. కుల వ్యవస్థ, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పాపన్న పోరాడారని, సామాజిక సమానత్వం కోసం కృషి చేశారని గుర్తు చేశారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, జిల్లా అధికారులు, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్
తదితరులు పాల్గొన్నారు. – కరీంనగర్‌అర్బన్

మంగళవారం శ్రీ 19 శ్రీ ఆగస్టు శ్రీ 2025