
గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్య
ధర్మపురి: భర్త అనారోగ్యంతో మంచానికే పరిమితం కాగా, మనస్తాపానికి గురై భార్య ధర్మపురి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై ఉదయ్‌కుమార్ తెలిపిన వివరాలు.. ధర్మపురికి చెందిన జువ్వాడి పద్మ (55)కు బాపు అనే వ్యక్తితో వివాహం జరిగింది. కొంతకాలంగా భర్తకు కళ్లు సరిగా కనిపించకపోవడంతో ఏ పని చేయక ఇంట్లోనే ఉంటున్నాడు. భార్య చిన్నచిన్న పనులు చేస్తూ భర్తను పోషించేది. ఇటీవల భర్త ఆరోగ్యం మరింత బాగా లేక మంచానికే పరిమితం కావడంతో ఎలా పోషించాలని మనస్తాపానికి గురైంది. శుక్రవారం గోదావరి స్నానానికి వెళ్లి అందులో దూకి మునిగిపోయింది. వెంటనే జాలర్ల సాయంతో బయటకు తీయగా అప్పటికే మృతిచెందింది. మృతురాలి మేనల్లుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.