
బైకులు.. భారీ శబ్దాలు..
తిమ్మాపూర్: సెలవులు వచ్చాయంటే చాలు రాజీవ్ రహదారి శబ్దాలతో దద్దరిల్లుతుంది. కరీంనగర్, తిమ్మాపూర్‌లోని ఇంజినీరింగ్ విద్యార్థులు పదుల సంఖ్యలో కలిసి భారీ శబ్దాలతో కూడిన వాహనాలు నడుపుతూ హడలెత్తిస్తున్నారు. సైలెన్సర్ల శబ్దంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం 40 మంది యువకులు జట్టుగా బైకులపై మండలంలోని రేణికుంట వరకు వెళ్లి, తిరిగి కరీంనగర్ వస్తూ స్టేజీల వద్ద హల్‌చల్ చేశారు. అటూఇటుగా వెళ్తున్న వాహనదారులకు ఇబ్బంది గురిచేశారు. పోలీసులు స్పందించి జరగరానిది జరగకముందే చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.