నిర్ణయం హర్షణీయం
మున్సిపాలిటీల్లోని పట్టణాల్లో అవసరమైన మౌలిక వసతులను గుర్తించి ప్రజలను భాగస్వామ్యం చేసేలా 100 రోజుల కార్యాచరణ చేపట్టడం హర్షణీయం. పట్టణ పౌరులుగా, సామాజిక స్పృహ ఉన్న వారిబాధ్యత పెంచేలా అధికారులు కార్యాచరణ చేపట్టేలా ప్రోత్సహించాలి.
–బొంకూరి అవినాష్, కమాన్‌రోడ్డు, పెద్దపల్లి
పార్కులు ఏర్పాటు చేయాలి
జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో మినీ ట్యాంక్‌బండ్ మినహా మరో పార్కులేదు. చిల్డ్రన్ పార్కు ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించాలి. స్వచ్ఛపెద్దపల్లిగా తీర్చిదిద్దడంలో పట్టణ ప్రజలు భాగస్వాములయ్యేలా అధికారులు ప్రోత్సహించాలి.
– బొడ్డుపల్లి సురేశ్, తిలక్‌నగర్, పెద్దపల్లి
పకడ్బందీగా కార్యాచరణ
వందరోజుల కార్యాచరణను పకడ్బందీగా అమలు చేస్తాం. ప్లాస్టిక్ నిషేధం, స్వచ్ఛత.. పరిశుభ్రత, హరితహారం లాంటివాటిలో ప్రజలను భాగస్వాములను చేస్తాం. స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు, స్వశక్తి సంఘాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం.
– వెంకటేశ్, మున్సిపల్ కమిషనర్, పెద్దపల్లి
నిర్ణయం హర్షణీయం
నిర్ణయం హర్షణీయం


