పశువులకు నీరందించాలి
వేసవిలో పాడి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. మంచినీటిని మూడుపూటలు అందించాలి. మధ్యాహ్నం వేళలో పశువులపై నీటిని జలకరించాలి. నీడ ఉండే ప్రాంతాల్లోనే పశువులను కట్టేయాలి. మూడు భాగాలు ఎండు గడ్డితో పాటు ఒక భాగం పచ్చిగడ్డి వేయాలి. పెంపుడు కుక్కలు ఉష్ణోగ్రతలకు చిరాకు పడుతుంటాయి. ఆయాసం, ఆకలి ఉంటుంది. ఫుడ్, వాటర్ సకాలంలో ఇవ్వాలి. వాటికి నీడ చల్లగా ఉండేలా చూడాలి. కోళ్ల ఫారాల్లో గన్నీసంచులను చుట్టూ కట్టడంతో పాటు రెండు గంటలకోసారి నీటితో తడపాలి.
– తుమ్మల కిరణ్‌కుమార్‌రెడ్డి, పశువైద్యుడు


