బాధ్యతలు చేపట్టిన జిల్లా జడ్జి
కరీంనగర్‌క్రైం: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఎస్.శివకుమార్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. కమర్షియల్ డిస్ప్యూట్స్ కోర్టు హైదరాబాద్ నుంచి బదిలీపై కరీంనగర్ కోర్టుకు వచ్చారు. ఇక్కడ జిల్లా జడ్జిగా పనిచేసిన బి.ప్రతిమ జనగాం జిల్లా జడ్జిగా బదిలీ అయ్యారు. కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా జే.విక్రమ్, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తిగా జే.కవిత బాధ్యతలు స్వీకరించారు.
పుస్తకాన్ని నమ్మినవారికి ఉజ్వల భవిష్యత్
కరీంనగర్‌కల్చరల్: పుస్తకాన్ని నమ్మినవారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్ రవికుమార్ తెలిపా రు. లీడ్ ఇండియా నేషనల్ క్లబ్ సౌజన్యంతో కరీంనగర్ జిల్లా గ్రంథాలయం ఆవరణలో బుఽ దవారం నిర్వహించిన ప్రపంచ పుస్తకం, కాపీరైట్ దినోత్సవ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డిజిటల్ యుగంలో యువత ఏకాగ్రతను భంగం చేసేందుకు స్మార్ట్‌ఫోన్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. పుస్తక పఠనానికి అధిక సమయం కేటాయించాలన్నారు. లీడ్ ఇండియా నేషనల్ క్లబ్ అధ్యక్షుడు బుర్ర మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ పుస్తకాలు మన జీవితకాల నేస్తాలని తెలిపారు. లీడ్ ఇండియా కోశాధికారి అనుముల దయాకర్, మిట్టపల్లి మహేందర్, లైబ్రేరియన్ సరిత పాల్గొన్నారు.
22 మంది టీచర్లకు కౌన్సెలింగ్
కరీంనగర్: స్పౌజ్ కేటగిరీ కింద ఇతర జిల్లాల నుంచి జిల్లాకు కేటాయింపబడ్డ 22 మంది ఉపాధ్యాయులకు బుధవారం డీఈవో కార్యాలయంలో కౌన్సెలింగ్ పూర్తి చేసినట్లు డీఈవో జనార్దన్‌రావు తెలిపారు. ఉపాధ్యాయులు రిలీవింగ్ ఆర్డర్, సర్వీసు బుక్, స్పౌజ్, ఇతర సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. కేటాయింపబడ్డ పాఠశాలలో రిపోర్టు చేసి, ఎంఈవో కార్యాలయంలో జాయినింగ్ రిపోర్టు సమర్పించాలని డీఈవో సూచించారు.
ధాన్యం కొనుగోళ్లలో సమస్యలా?
● కంట్రోల్ రూం నంబర్ 91542 49727
కరీంనగర్ అర్బన్: తేమ ఎక్కువ ఉందని, నిబంధనల ప్రకారం ఉన్నా ధాన్యం కొనుగోలు చేయడం లేదా.. అయితే ఇంకెందుకు ఆలస్యం ఫోన్ చేయండి.. పరిష్కారం పొందండి. ధాన్యం కొనుగోళ్లలో సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టరేట్‌లోని పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూం ఫోన్ నంబర్ 9154249727 ఏర్పాటు చేయగా ప్రభుత్వ పనివేళల్లో సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. కంట్రోల్ రూంకు వచ్చిన ప్రతీ ఫిర్యాదును ప్రత్యేక రిజిష్టర్‌లో నమోదు చేసి అధికారులను అప్రమత్తం చేయనున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలున్నా రైతులు కంట్రోల్ రూం దృష్టికి తీసుకురావచ్చని జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు వివరించారు.
పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ లైన్ల నూతన పనులు చేపడుతున్నందున గురువారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు 11 కె.వీ.పిటిసీ ఫీడర్ పరిధిలోని సంతోష్‌నగర్, శ్రీహరినగర్, కుర్మవాడ, గణేశ్‌నగర్, పీటీసీ, పాల డెయిరీ, బుల్ స్టేషన్, కాంగ్రెస్ భవన్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు.
బాధ్యతలు చేపట్టిన జిల్లా జడ్జి


