కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో అరుదైన దంత శస్త్ర చికిత్స
కరీంనగర్‌టౌన్: కరీంనగర్ ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో అరుదైన దంత శస్త్రచికిత్స నిర్వహించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి తెలిపారు. మూడేళ్లుగా జీజీహెచ్‌లోని దంత విభాగం ఆరోగ్యశ్రీ సేవల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుపుకుంటుందన్నారు. ఈక్రమంలో ఆధునిక నైపుణ్యాన్ని అవసరమైన పేషంట్లకు అందించడం జరుగుతుందన్నారు. మొదటిసారిగా అనస్తీసియాలో అత్యాధునిక పద్ధతిలో రోడ్డు ప్రమాదంలో ముఖం, దౌడ, ముక్కు విరిగిన 33 ఏళ్ల శివకుమార్‌కు ఓరల్, మాక్సిలో ఫేషియల్ సర్జన్ డాక్టర్ డి.సతీశ్‌కుమార్ ఓపెన్ రిడక్షన్, ఇంటర్నల్ ఫిక్సేషన్ ద్వారా సర్జరీ నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ శస్త్రచికిత్సలో సీనియర్ ఫిజీషియన్ నవీన, సీనియర్ దంత వైద్య నిపుణులు రవిప్రవీణ్‌రెడ్డి, హఫీజ్, అనిస్తీషియా సతీశ్ కుమార్, వంశీ, సుగాత్రి, ఈఎన్‌టీ సందీప్‌రెడ్డి, జమున తదితరులు పాల్గొన్నారు.


