మాతృ మరణాలు తగ్గించడమే లక్ష్యం
సుల్తానాబాద్: మాతా, శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు జిల్లావాసుల్లో అవగాహన కల్పించేలా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమంలో భాగంగా కేంద్రప్రభుత్వం ఈమేరకు పలు రకాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వ్యాధి నిరోధక టీకాలు వేస్తోంది. పౌష్టికాహారం అందిస్తోంది. నిత్యం వ్యాయామం చేయిస్తోంది. మరణాలను నివారించి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం, సమాజం.. మొత్తంగా ప్రపంచ కూడా ఆరోగ్యం ఉంటుందని భావిస్తోంది.
మానసిక ప్రశాంతత ముఖ్యం
మనిషి శారీరకంగా ఎంత ఆరోగ్యంగా ఉన్నా.. మానసిక ప్రశాంతత లేకపోతే జీవనగమనం లయ తప్పుతుంది. దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే అవకాశం ఉంది. విపరీతమైన ఆలోచనలతో ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుంది. కరోనా తర్వాత మనిషి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడని డబ్ల్యూహెచ్‌వో ఇటీవల హెచ్చరించింది.
నేడు ర్యాలీలు..
జిల్లావ్యాప్తంగా జిల్లాకేంద్రంతోపాటు అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మండల కేంద్రాలలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మండల కేంద్రాల్లో ర్యాలీ నిర్వహించనున్నారు.
ఆరోగ్య సంరక్షణపై అవగాహన
నేడు జిల్లాలో అవగాహన ర్యాలీలు
విజయవంతం చేయాలి
జిల్లా, మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. సిబ్బంది విధిగా పాల్గొని విజయవంతం చేయాలి. గర్భిణులను చైతన్యవంతం చేయడంతోపాటు నిత్యం వ్యాయామం చేసి పౌష్టికాహారం తీసుకునేలా ప్రజల్ని ప్రోత్సహించాలి.
– అన్నప్రసన్న కుమారి, డీఎంహెచ్‌వో
మాతృ మరణాలు తగ్గించడమే లక్ష్యం


