ప్రతీ హిందువు భగవద్గీత పఠించాలి
చొప్పదండి: ప్రతి హిందువు భగవద్గీత పఠించాలని శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయార్ స్వామి పేర్కొన్నారు. చొప్పదండిలోని జ్ఞాన సరస్వతి ఆలయాన్ని గురువారం సందర్శించి ప్రచనాలు అందించారు. శ్రీవేంకటేశ్వర మణికంఠ ఆలయంలో పూజలు జరిపారు. ప్రతి హిందువు భగవద్గీతను నేర్చుకోవాలని, 700 శ్లోకాల్లో ప్రతిరోజు రెండు శ్లోకాలు నేర్చుకుంటే ప్రయోజనం ఉంటుందన్నారు. వికాస తరంగిణీ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ గుర్రం నీరజ, ఇప్పనపల్లి విజయలక్ష్మి, పుల్యాల లక్ష్మారెడ్డి, గుర్రం ఆనందరెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, తిప్పర్తి శ్రీనివాస్, జగన్‌మోహన్ పాల్గొన్నారు.
కరీంనగర్‌లో పర్యటన
రామానుజ దేవనాఽథ జీయర్ స్వామి కరీంనగర్‌లోని వావిలాలపల్లిలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో లక్ష్మీపూజ నిర్వహించారు. తిరుమలనగర్‌లో వికాస తరంగిణి యూని ట్‌ను ప్రారంభించారు. సప్తగిరికాలనీ కోదండ రామాలయాన్ని సందర్శించారు.
కరీంనగర్‌కల్చరల్: అణుబాంబు కన్నా కవి త్వం బలమైందని ప్రముఖ సినీ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ రచయితల సంఘం ఏటా అందిస్తున్న కాళోజీ పురస్కారాల వేడుకను గురువారం ఫిలింభవన్‌లో నిర్వహించారు. కొత్త అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 2024 ఏడాదికి గాను సిద్దిపేటకు చెందిన పప్పుల రాజిరెడ్డికి, 2025కు బోధన్‌కు చెందిన మొగిలి స్వామిరాజుకు పెద్దింటి అశోక్ కుమార్ చేతుల మీదుగా పురస్కారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో దోహదపడే కవులపాత్రకు పురస్కారాలే అసలైన గుర్తింపు అన్నారు. పిడికెడు అక్షరాలే సమాజాన్ని నడిపిస్తాయన్నారు. కవులు సుదర్శనం వేణు, గుండేటి రాజు, కాండూరి వెంకటేశ్వర్లు, అన్నాడి గజేందర్‌రెడ్డి, స్తంభంకాడి గంగాధర్, దొమ్మటి శంకర్ ప్రసాద్, నీలగిరి అనిత, బొమ్మకంటి కిషన్, గంగుల శ్రీకర్, సునీత, కాసు మహేందర్ రాజు, గందె పరశురాములు,, రేగులపాటి విజయలక్ష్మి, సుగుణ, కూకట్ల తిరుపతి పాల్గొన్నారు.
అర్చక చైతన్య యాత్రను
విజయవంతం చేయాలి
కరీంనగర్‌కల్చరల్: ఽదూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవశర్మ ఆధ్వర్యంలో శుక్రవారం తిమ్మాపూర్‌లోని తాపాల నరసింహస్వామి ఆలయంలో జరిగే అర్చక చైతన్య యాత్రను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తిరునగరి వెంకటాద్రి స్వామి ఒక ప్రకటనలో కోరారు. ఉమ్మడి జిల్లా అర్చకులతో సదస్సు జరిగిన అనంతరం దేవాదాయశాఖ సహాయ కమిషనర్ కార్యాలయానికి యాత్రగా వెళ్లి కమిషనర్‌కు తీర్మానాలతో కూడిన వినతిపత్రం సమర్పిస్తామని పేర్కొన్నారు.


