శుక్రవారం శ్రీ 26 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సీఎస్‌ఐ క్యాథడ్రల్ చర్చిలో గీతాలు ఆలపిస్తున్న క్యారల్స్ బృందం
సీఎస్‌ఐ సెంటనరీ వెస్లీచర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో క్రిస్టియన్లు
కరీంనగర్‌కల్చరల్: జిల్లావ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను క్రిస్టియన్లు ఘనంగా జరుపుకున్నారు. గురువారం ఉదయం నూతన వస్త్రాలు ధరించి చర్చికి వెళ్లారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బైబిల్ పఠించారు. ప్రత్యేక గీతాలాపనలు చేశారు. మతపెద్దలు దైవ సందేశాన్ని అందించారు. కరీంనగర్‌లోని సీఎస్‌ఐ (వెస్ట్) క్యాథడ్రల్ చర్చి, సీఎస్‌ఐ సెంటినరీ వెస్లీ, సెయింట్ మార్క్‌చర్చితో పాటు వివిధప్రాంతాల్లోని ప్రార్థనా మందిరాలు కిటకిటలాడాయి. పోలీసు కమిషనరేట్ ఎదురుగా ఉన్న సీఎస్‌ఐ వెస్లీ క్యాథడ్రల్ చర్చిలో ఫాస్టరేట్ చైర్మన్ పాల్ కొమ్మాలు సందేశం ఇచ్చారు. అసిస్టెంట్ ప్రెస్బిటర్లు మధుమోహన్, పాస్టరేట్ సెక్రటరీ జీబీ. సంజయ్‌కుమార్, ట్రెజరర్లు ముల్కల సంజయ్, ఎర్ర జాకబ్ పాల్గొన్నారు. క్రిస్టియన్ కాలనీలోని సీఎస్‌ఐ సెంటినరీవెస్లీ చర్చిలో ఫాస్టరేట్ చైర్మన్ ఎస్.జాన్ ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. అసిస్టెంట్ ప్రెస్బిటర్ రెవ ఎం.పింటు, సెక్రటరీ సి.సంజయ్‌కుమార్, ట్రెజరర్ సి.నారాయణ పాల్గొన్నారు.
శుక్రవారం శ్రీ 26 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
శుక్రవారం శ్రీ 26 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
శుక్రవారం శ్రీ 26 శ్రీ డిసెంబర్ శ్రీ 2025


