జగిత్యాల: బీసీ కులాల స్థితిగతులను తెలుసుకునేందుకు జిల్లాల్లో పర్యటిస్తున్నామని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు. గురువారం జగిత్యాల జిల్లాలోని మెడికల్ కళాశాల గెస్ట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. బీసీ కులాల్లోని వీరముష్ఠి, పిచ్చకుంట్ల, దొమ్మర కులస్తులు విద్యాలయాలు, ఉద్యోగస్థలాల్లో కులం పేరు పిలిపించుకునేందుకు ఇబ్బంది పడుతున్నామని, ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలని కోరాయని, వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. వారి కులాల మార్పు కోసం ఇప్పటికే ప్రతినిధులతో చర్చించామని, ఈనెల 29న ప్రభుత్వానికి నివేదిస్తామని పేర్కొన్నారు. రాజీవ్ యువ వికాస్ పథకాని పేదలను గుర్తించి ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మీ, బీసీ సంక్షేమ శాఖ అధికారి కల్పన పాల్గొన్నారు.
కమిషన్‌కు వినతుల వెల్లువ
గాంధీనగర్‌లో వీరముష్ఠి, దొమ్మర, పిచ్చకుంట్ల కులాల వారు కమిషన్‌ను మహిళలు కలిశారు. తమ కులం పేరు మార్చాలని కోరారు. అనంతరం మేరు, బీసీసంక్షేమ, నాయీబ్రాహ్మణ, బీసీ హక్కుల సాధన కమిషన్ నాయకులు వినతిపత్రాలు సమర్పించారు. అనంతరం కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందించారు.
నర్సింహుడిని దర్శించుకున్న చైర్మన్
ధర్మపురి: శ్రీలక్ష్మినృసింహస్వామిని బీసీ కమిషనర్ సభ్యులు దర్శించుకున్నారు. వారికి దేవస్థానం పక్షాన పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్ స్వామివారి శేషవస్త్రం కప్పి ఫొటో, ప్రసాదాలు అందించారు.
బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్


