ఆరుగురు ఆర్టీసీ ఉద్యోగుల సరెండర్‌! | Sakshi
Sakshi News home page

ఆరుగురు ఆర్టీసీ ఉద్యోగుల సరెండర్‌!

Published Sat, Apr 20 2024 1:45 AM

-

హుజూరాబాద్‌: స్థానిక ఆర్టీసీ డిపో పరిధిలో విధులు నిర్వహించే ఆరుగురు ఉద్యోగులను ఆర్‌ఎం కార్యాలయానికి సరెండర్‌ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో వారు శుక్రవారం ఆర్‌ఎం ఆఫీస్‌లో రిపోర్టు చేసినట్లు సమాచారం. ఇటీవల ఓ ఆర్టీసీ డ్రైవర్‌ వద్ద హుజూరాబాద్‌ డిపో మేనేజర్‌ సామల శ్రీకాంత్‌ రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం విధితమే. ఈ క్రమంలో డిపోలో విజిలెన్స్‌ అధికారులు రెండు రోజులపాటు విచారణ చేపట్టారు. ఇందులో డీఎం శ్రీకాంత్‌ అవినీతి అక్రమాలకు సహకరించినట్లు తేలిన డిపో పరిధిలోని ఆరుగురు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. డీఎం శ్రీకాంత్‌ చిన్న చిన్న కారణాలు చూపుతూ, అనుమతి లేకుండా అత్యవసరంగా సెలవులు తీసుకున్న ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసి, డబ్బులు డిమాండ్‌ చేయడం, ఇవ్వని పక్షంలో పలువురికి చార్జీ మెమోలు ఇచ్చినట్లు తేల్చారని సమాచారం. వాటిని విజిలెన్స్‌ అధికారులు సీజ్‌ చేసి, కరీంనగర్‌ ఆర్‌ఎం కార్యాలయానికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

ఇన్‌చార్జి డీఎంగా వెంకటేశ్వర్లు..

హుజూరాబాద్‌ ఇన్‌చార్జి డీఎంగా హుస్నాబాద్‌ డీఎం వెంకటేశ్వర్లును నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు.

ఆర్‌ఎం ఆఫీస్‌లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించినట్లు సమాచారం

ఏసీబీకి చిక్కిన హుజూరాబాద్‌ డీఎంకు సహకరించడమే కారణం?

Advertisement
 
Advertisement
 
Advertisement