ఆరోగ్య క్రమశిక్షణతో అవయవాలు భద్రం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య క్రమశిక్షణతో అవయవాలు భద్రం

Apr 20 2024 1:45 AM | Updated on Apr 20 2024 1:45 AM

మాట్లాడుతున్న మేయర్‌ సునీల్‌రావు - Sakshi

మాట్లాడుతున్న మేయర్‌ సునీల్‌రావు

కరీంనగర్‌టౌన్‌: మనిషి ఆరోగ్య క్రమశిక్షణ పాటిస్తే అన్ని అవయవాలు భద్రంగా ఉండి, ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చని మేయర్‌ వై.సునీల్‌రావు అన్నారు. వరల్డ్‌ లివర్‌ డే సందర్భంగా శుక్రవారం కరీంనగర్‌ మెడికవర్‌ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ఆహారం మితంగా తీసుకుంటూ ప్రతీరోజు ఒక గంట వ్యాయామం చేయాలన్నారు. ముఖ్యంగా లివర్‌ పనితీరును బట్టే శరీరంలోని జీవ, జీర్ణక్రియలు సక్రమంగా జరుగుతాయని పేర్కొన్నారు. మెడికవర్‌ ఆస్పత్రి వైద్యులు ప్రజల ఆరోగ్యం కోసం తమ వంతు బాధ్యతగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండటం అభినందనీయమన్నారు. మెడికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్‌ ప్రణీత్‌, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్‌ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ.. మానవ శరీరంలో గుండె, మెదడు తర్వాత అతి ముఖ్యమైన అవయవం లివర్‌ అని తెలిపారు. అతిగా ఆల్కహాల్‌ సేవించడం వల్ల అది దెబ్బతింటుందని, ఆల్కహాల్‌ మానాలని సూచించారు. ఆస్పత్రి సిబ్బందికి జుంబా డ్యాన్స్‌పై శిక్షణతోపాటు ప్రదర్శన నిర్వహించారు. హాస్పిటల్‌ సెంటర్‌ హెడ్‌ గుర్రం కిరణ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ మేచినేని వనజ, మేచినేని పవన్‌రావు, వైద్యులు వినయ్‌కుమార్‌, ఉపేందర్‌రెడ్డి, రవిమల్లారెడ్డి, మార్కెటింగ్‌ మేనేజర్‌ కర్ణాకర్‌, ఆపరేషన్స్‌ మేనేజర్‌ సాయిచరణ్‌ పాల్గొన్నారు.

మేయర్‌ వై.సునీల్‌రావు

మెడికవర్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో వరల్డ్‌ లివర్‌ డే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement