కాంగ్రెస్‌ బలోపేతానికి పాత మిత్రులు కలిసిరావాలి.. | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ బలోపేతానికి పాత మిత్రులు కలిసిరావాలి..

Feb 8 2024 1:34 AM | Updated on Feb 8 2024 5:08 PM

- - Sakshi

కాంగ్రెస్‌లో చేరుతున్న భాస్కర్‌రెడ్డి, పక్కన మంత్రి పొన్నం ప్రభాకర్‌

కరీంనగర్‌: కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి పాత మిత్రులు కలిసి రావాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి పోటీచేయని పాత కాంగ్రెస్‌ నాయకులు తిరిగి పార్టీలోకి రావాలన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకుడు, మాజీ ఏఎంసీ చైర్మన్‌ ఆకారపు భాస్కర్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ నాయకత్వంలో దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం కాంగ్రెస్‌ పాటుపడుతుంటే, కొంతమంది మతం పేరిట, దేవుళ్ల ఫొటోలతో గెలవాలనుకుంటున్నారని విమర్శించారు. సీనియర్‌ నాయకుడైన భాస్కర్‌రెడ్డి, తిరిగి పార్టీలోకి రావడం సంతోషకరమన్నారు.

సొంత గూటికి ఆకారపు భాస్కర్‌రెడ్డి
బీఆర్‌ఎస్‌ నాయకుడు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఆకారపు భాస్కర్‌రెడ్డి సొంత గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడైన ఆయన, కొన్ని సంవత్సరాల క్రితం బీఆర్‌ఎస్‌లో చేరారు. బుధవారం బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జీ రోహిత్‌ చౌదరి, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. బీఆర్‌ఎస్‌లో సీనియర్‌ నాయకులకు గుర్తింపు లేదని ఆకారపు భాస్కర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు పురుమల్ల శ్రీనివాస్‌, కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి, మేనేని రోహిత్‌ రావు, మూల వెంకట రవీందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇవి చదవండి: ‘కుప్టి’కి నిధులు కేటాయించేలా చూస్తా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement