బో‘నమో’ పోచమ్మతల్లి | - | Sakshi
Sakshi News home page

బో‘నమో’ పోచమ్మతల్లి

Mar 16 2026 7:52 AM | Updated on Mar 16 2026 7:52 AM

చామనపల్లిలో బోనాలతో వెళ్తున్న మహిళలు

తాహెర్‌ కొండాపూర్‌లో బోనాలతో మహిళలు

నగరంలోని కోతిరాంపూర్‌ పోచమ్మ ఆలయంలో పూజలు

గ్రామ దేవత అయిన పోచమ్మ తల్లికి ఉగాదికి ముందు బోనం చెల్లించడం ఆనవాయితీ. ఈనెల 19న ఉగాది నేపథ్యంలో పండుగకు ముందు చివరి ఆదివారం కావడంతో కరీంనగరంతో పాటు జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో బోనమెత్తారు. కరీంనగర్‌లోని పోచమ్మ ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. కోతిరాంపూర్‌లోని పోచమ్మతల్లికి భక్తులు బోనాల వేడుకను ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల నడుమ మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. పసుపు, కుంకుమ సమర్పించి, ఒడిబియ్యం పోశారు. 54వ డివిజన్‌లోనూ పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి పూజలు నిర్వహించారు. కార్పొరేటర్‌ గొట్టిముక్కుల ఉమారాణి పాల్గొన్నారు. – కరీంనగర్‌ కల్చరల్‌/ విద్యానగర్‌/కరీంనగర్‌ రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement