రాజీవ్ రహదారిపై దట్టంగా ఆవరించిన పొగ
కరీంనగర్‌కార్పొరేషన్: నగరంలోని డంప్‌యార్డ్‌లో మళ్లీ మంటలు చెలరేగాయి. ఆదివారం ఆటోనగర్, కోతిరాంపూర్, అల్కాపురి కాలనీ, గణేష్ నగర్, పోచమ్మవాడ, లక్ష్మీనగర్, కమాన్ తదితర ప్రాంతాల్లో పొగ దట్టంగా వ్యాపించింది. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ డంప్ యార్డ్‌ను సందర్శించి శాశ్వత పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పలు ఏజెన్సీలతో బయో ప్రక్రియ కొనసాగుతోంది. కానీ ప్రతి రోజూ డంప్‌యార్డ్‌లో మంటలు, పొగ కారణంగా నగరవాసుల సమస్య మాత్రం తీరడం లేదు. తాత్కాలిక పరిష్కారమైన చూపాలని బాధిత ప్రజలు కోరుతున్నారు.


