కరీంనగర్‌టౌన్: ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. ఓ ప్రైవేట్ కార్యక్రమం కోసం ఆదివారం కరీంనగర్‌కు వచ్చిన ఆయనకు నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద అధికారులు ఘన స్వాగతం పలికారు. ఇన్‌చార్జి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తిరుపతిరావు, జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అధికారి విజయపాల్ రెడ్డి, ఇన్‌చార్జి జిల్లా ట్రైబ ల్ వెల్ఫేర్ అధికారి దివాకర్ రావు శాలువాతో సత్కరించారు. చైర్మన్ వెంకటయ్య జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, అమలు చేస్తున్న పథకాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అధికారులు బాధ్యతాయుతంగా పనిచేస్తూ పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు.
కవిత అరెస్ట్‌కు కేటీఆర్, హరీశ్ కుట్ర
కరీంనగర్ కార్పొరేషన్: లిక్కర్ కేసులో కల్వ కుంట్ల కవితను మరోసారి జైలుకు పంపించేందుకు కేటీఆర్, హరీశ్‌రావు కుట్రపన్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం ఆరో పించారు. ఆదివారం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మాట్లాడుతూ కవితకు మరో సారి సీబీఐ నోటీసుల వెనుక కేటీఆర్, హరీశ్‌రావు కుట్ర దాగి ఉందన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో మాట్లాడి నోటీసు ఇచ్చేలా చేశారన్నారు. రాష్ట్రానికి డ్రగ్స్‌ను పరి చయం చేసిందే బీఆర్‌ఎస్ అని ధ్వజమెత్తారు. ఆ దందాకు కేటీఆరే నాయకుడని ఆరోపించారు. కరీంనగర్ యువతకు ఇక్కడి మాజీ మంత్రి గంజాయి అలవాటు చేశారని విమర్శించారు. ఎస్.అజయ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు
కొత్తపల్లి(కరీంనగర్): ప్రకృతి విపత్తులైన భారీ వర్షాలు, ఈదురుగాలులతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడినప్పుడు, వాటి ని నివారించేందుకు ఎమర్జెన్సీ రీస్టోరేషన్ వాహనాలు, టీంను అందుబాటులో ఉంచుతున్నట్లు టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఇన్‌చార్జి ఎస్‌ఈ వి.గంగాధర్ ఒక ప్రకటనలో తెలి పారు. విద్యుత్ అంతరాయాలను తగ్గించి విని యోగదారులకు త్వరితగతిన సేవలు అందించేందుకు కరీంనగర్ సర్కిల్ పరిధిలో విద్యుత్ సిబ్బంది బృందంతో కూడిన నాలుగు ఎమర్జెన్సీ రీస్టోరేషన్ వాహనాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. సబ్‌డివిజన్ స్థాయిలో ఒక్కో వాహనాన్ని సిద్ధంగా ఉంచి అత్యవసర పరిస్థితుల్లో వినియోగిస్తున్నామన్నారు. ఈ వాహనాల్లో విద్యుత్ లైన్ల మరమ్మతులకు అవసరమైన కండక్టర్లు, ఇన్సులేటర్లు, కేబుల్స్, టూల్స్ అందుబాటులో ఏర్పాటు చేసుకొని, వాహనాలకు జీపీఆర్‌ఎస్ ప్రకారం సమస్య ఏర్పడిన ప్రాంతానికి బృందాన్ని పంపించి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.
కరీంనగర్ ఎస్‌ఈగా రవీందర్
కొత్తపల్లి(కరీంనగర్): టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈగా ఆర్. రవీందర్ నియమితులయ్యారు. కామారెడ్డి ఎస్‌ఈ గా పనిచేస్తున్న రవీందర్‌ను కరీంనగర్‌కు బదిలీ చేస్తూ సీఎండీ కర్ణాటి వరుణ్‌రెడ్డి ఉత్తర్వులిచ్చారు. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సర్కిల్ డీపీఈ డీఈగా విధులు నిర్వర్తించారు. కరీంనగర్ ఎస్‌ఈ రమేశ్‌బా బు పదవీ విరమణ చేయగా, పెద్దపల్లి ఎస్‌ఈ గంగాధర్ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఇకనుంచి కరీంనగర్ సర్కిల్‌కు పూర్తిస్థాయి ఎస్‌ఈగా రవీందర్ బాధ్యతలు చేపట్టనున్నారు.


