ఊపిరి ఉన్నంత వరకూ కేసీఆర్‌ వెంటే: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

ఊపిరి ఉన్నంత వరకూ కేసీఆర్‌ వెంటే: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

Dec 5 2023 5:00 AM | Updated on Dec 5 2023 12:27 PM

- - Sakshi

హుజూరాబాద్‌: తన ఊపిరి ఉన్నంత వరకు కేసీఆర్‌ వెంటే నడుస్తానని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని సిటీ సెంట్రల్‌ ఫంక్షన్‌ హాల్‌లో మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి కేసీఆర్‌ ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇ చ్చారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనపై అభిమానం చూపించి ఓటు వేసిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. హుజూరాబాద్‌ అభివృద్ధి కోసం పాటుపడతానని అన్నారు. ప్రజలకు ఎన్నికలు సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలన్ని నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలకు అమలు చేసిందో, వాటిని తూచా తప్పకుండా కొనసాగిస్తానని అన్నారు. కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలతోపాటు మేనిఫెస్టోను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెల్యే సతీమణి, కూతురు షాలినిరెడ్డి, శ్రీనికలు మాట్లాడుతూ తమపై నమ్మ కం ఉంచి గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక శ్రీని వాస్‌, వైస్‌చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల శ్రీనివాస్‌, బండ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement