
ప్రజాతీర్పుతోనే విజయం సాధించా. రెండుసార్లు ఓటమి చెందినా ప్రజలతోనే ఉన్నా. స్థానికేతరుడైన రసమయి ఇబ్బందులు భరించలేక ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌పాలన అవినీతిమయంగా మారింది. ప్రజలు ఈ సారి కాంగ్రెస్ వైపే ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధే నా ధ్యేయంగా పనిచేస్తాను.
– కవ్వంపల్లి సత్యనారాయణ, మానకొండూర్ ఎమ్మెల్యే
మార్పు కోరుకున్నారు
ప్రజలు మార్పు కోరుకున్నారు. వారి తీర్పు ను గౌరవిస్తా. పదేళ్ల పాటు నాకు మానకొండూర్ నియోజకవర్గంలో అభివృద్ధి చేసే భా గ్యం కల్పించినందుకు అదృష్టంగా భావి స్తున్నా. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే. ఓటమి చెందినాప్రజలకు అందుబాటులోనే ఉంటూ సేవచేస్తా. కార్యకర్తలు అధైర్యపడొద్దు.
– రసమయి బాలకిషన్, మానకొండూర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి
తీర్పును శిరసావహిస్తా
మానకొండూర్ నియోజకవర్గ ప్రజల తీర్పును శిరసావహిస్తా. ప్రజలు బీఆర్‌ఎస్‌పై విశ్వాసం కోల్పోయారు. ప్రధాని మోదీ దేశాభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే తెలంగాణ బాగా అభివృద్ధి జరిగేది. ఏది ఏమైన ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తా.
– ఆరెపల్లి మోహన్, మానకొండూర్ బీజేపీ అభ్యర్థి

