బల్దియాలో స్వచ్ఛ్‌ దివాళి | Sakshi
Sakshi News home page

బల్దియాలో స్వచ్ఛ్‌ దివాళి

Published Sat, Nov 11 2023 12:50 AM

- - Sakshi

కరీంనగర్‌ కార్పొరేషన్‌: ప్లాస్టిక్‌ నిషేధించాలని కోరుతూ నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం స్వచ్ఛ్‌ దివాళి, శుభ్‌ దివాళి ఘనంగా నిర్వహించారు. కమిషనర్‌ బోనగిరి శ్రీనివా స్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన దీపాలు వెలిగించారు. అనంతరం వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు, మెప్మా ఆర్పీలు సైతం కరీంనగర్‌ ఎంసీకే పేరుతో దీపాలను వెలిగించి దీపోత్సవం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ ఫ్లెక్సీలు ప్రదర్శించి అవగాహన చేపట్టారు. డిప్యూటీ కమిషనర్‌ స్వరూప రాణి, ఎస్‌ఈ నాగమల్లేశ్వర్‌ రావు, అసిస్టెంట్‌ కమిషనర్‌ నరేశ్‌బాబు, ఈఈ మహేందర్‌, డీఈలు ఓం ప్రకాశ్‌, వెంకటేశ్వర్లు, ఆర్వో ఆంజనేయులు, శానిటేషన్‌ సూపర్‌వైజర్‌ రాజమనోహర్‌, ఎన్విరాన్మెంటల్‌ ఇంజినీర్‌ స్వామి పాల్గొన్నారు.

బహిరంగ చర్చకు సిద్ధం

కరీంనగర్‌: కరీంనగర్‌ ఎంపీ, బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి బండి సంజయ్‌ విసిరిన సవాల్‌కు సిద్ధంగా ఉన్నామని, బహిరంగ చర్చకు వేదిక, సమయం నిర్ణయిస్తే తాము రావడానికి రెడీఅని మేయర్‌ వై.సునీల్‌రావు అన్నారు. శుక్రవారం నగరంలో మాట్లాడుతూ.. మంత్రి గంగులను అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావా లని బండి సంజయ్‌ కోరడం విడ్డూరంగా ఉందని అన్నారు. నాలుగున్నరేళ్లుగా కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో కానీ, అసెంబ్లీ నియోజకవర్గానికి కానీ సంజయ్‌ చేసిందేమి లేదన్నానరు. ఎంపీగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రధా ని మోడీతో ఉన్న చనువుతో వేల కోట్ల నిధులు తీసుకవస్తారని ఆశించామని, అందుకు భిన్నంగా ఎంపీ గ్రాంటు రూ.90లక్షలు తప్పా ఒక్కరూపాయి కేటాయించిన దాఖలాలు లేవని మండిపడ్డారు. జాతీయ రహదారులు, రైల్వేఓ వర్‌ బ్రిడ్జిలు మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ ప్రతి పాదనల మేరకే మంజూరయ్యాయన్న విష యం తెలుసుకోవాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ను, మంత్రి కమలాకర్‌ను విమర్శించే అర్హత సంజయ్‌కి, పురుమల్ల శ్రీనివాస్‌కి లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.

పత్తి మార్కెట్‌కు మూడు రోజులు సెలవు

జమ్మికుంట: జమ్మికుంట పత్తి మార్కెట్‌కు మూడు రోజులు సెలవు ప్రకటించారు. శని, ఆది సాధారణ, సోమవారం దీపావళి సందర్భంగా సెలవు ఉంటుందని యార్డు కార్యదర్శి గుగులోతు రెడ్డి నాయక్‌ వెల్లడించారు. మంగళవారం నుంచి క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని అన్నారు. కాగా.. మార్కెట్లో శుక్రవారం క్వింటాల్‌ పత్తి గరిష్టంగా రూ.6,850 పలికింది. 119వాహనాల్లో 1,163 క్వింటాళ్ల కొత్తపత్తిని రైతులు తెచ్చారు. మోడల్‌ ధర రూ.6,500, కనిష్ట ధర రూ.6,000 పలికింది. గన్నీసంచుల్లో 45 మంది 99క్వింటాళ్లు తెచ్చారు. గరిష్ట ధర రూ.6,400, మోడల్‌ ధర రూ.6,200, కనిష్ట ధర రూ.5,800కు వ్యాపారులు పత్తిని కొనుగోలు చేశారు. మార్కెట్‌లో ఏడుగురు రైతులకు చెందిన 52.05 క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది. గరిష్ట ధర రూ.7,020, మోడల్‌ ధర రూ.6,950, కనిష్ట ధర రూ. 6,809లు పలికింది.

1/1

Advertisement
 
Advertisement
 
Advertisement