
విద్యార్థులను అభినందిస్తున్న ఫాతిమారెడ్డి
కొత్తపల్లి: న్యూఢిల్లీకి చెందిన ఐఎంవో ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ నిర్వహించిన గణిత పరీక్షలో రేకుర్తిలోని ప్యారడైజ్ పారడైజ్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించినట్లు ఆ పాఠశాల చైర్మన్ పోతిరెడ్డి ఫాతిమారెడ్డి తెలిపారు. పాఠశాలలో గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు పి.అక్షిత, పి.శివాని, హెచ్.శ్రీజ, జి.లాస్య, బి.మేఘనలను అభినందించారు. అకాడమిక్ సీఈవో ఉమాకాంత్, ప్రిన్సిపాల్ టి.వసంత, వైస్ ప్రిన్సిపాల్ ఏ.మధు, ఏవో కె.శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మద్యం పట్టివేత
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం మొగ్దూంపూర్‌లో గురువారం ద్విచక్రవాహనంపై అక్రమంగా మద్యం తరలిస్తున్న కల్లెపల్లి సుధాకర్‌ను ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా తరలిస్తున్న సుధాకర్‌ను రెండు కాటన్ల బీర్లతో పాటు ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకుని ఎకై ్సజ్‌స్టేషన్‌కు తరలించారు. ఎకై ్సజ్ డీసీ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని రూరల్ సీఐ తిరుమల లత తెలిపారు. ఎస్సైలు స్వప్న, సింధు, అశోక్, క్రిష్‌ధర్, స్వప్న,శ్రీలత, రమాదేవి, రమ్య పాల్గొన్నారు.
టీచర్ల ఆర్థికసాయం
శంకరపట్నం: మండలంలోని మొలంగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీఈటీ జ్యోతి, తెలుగు టీచర్ ఆదిలక్ష్మిలు పాఠశాల అభివృద్ధికి రూ.5వేల చొప్పున ఆర్థికసాయం చేశారు. గురువారం హెచ్‌ఎంకు నగదు అందించారు.

పట్టుకున్న బైక్, మద్యం సీసాలు