నియంత పాలనపై ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలి

సమావేశంలో మాట్లాడుతున్న వీరయ్య
 - Sakshi

కరీంనగర్‌: కేంద్ర ప్రభుత్వ నియంతపాలనపై ప్రజలు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కా వాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్‌.వీరయ్య పిలుపునిచ్చారు. సీపీఎం జన చైతన్య బస్సుయాత్ర ఆదివారం జిల్లాలోకి ప్రవేశించింది. చింతకుంట, పద్మనగర్‌ మీదుగా ప్రజానాట్యమండలి కళాకారుల ఆటపాటలతో, బైకులతో భారీ ర్యాలీగా కోతిరాంపూర్‌లోని అన్నమనేని గార్డెన్‌ చేరుకొని బహిరంగ సభ నిర్వహించారు. జిల్లా కార్యదర్శి మిలు కూరి వాసుదేవరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో వీరయ్య మాట్లాడారు. దేశంలో తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ అభివృద్ధిపై మాట్లాడకుండా మతోన్మాదాన్ని పెంచి పోషి స్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జికి నిధులు కేటా యించామని క్షీరాభిషేకాలు చేసుకొని ఏళ్లు గడుస్తున్నా పునాదిరాయి వేయకపోవడం సిగ్గుచేటన్నారు. పార్లమెంటులో ప్రధాని, అదానిని ప్రశ్నిస్తున్న రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ, అందరం ఐక్యంగా మతోన్మాద బీజేపీని ఎదిరించాలని అన్నారు. కాంగ్రెస్‌ నాయకుడు ఎం.రోహిత్‌రావు మాట్లాడుతూ, విద్యుత్‌ పోరాటంలో కమ్యూనిస్టులు ముందుండి పోరాడారని, వారి స్ఫూర్తితోని బీజేపీని ఎదుర్కోవాలన్నారు. జనచైతన్య యాత్రలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఆశయ్య, స్కైలాబ్‌బాబు, జగదీశ్‌, పి.జయలక్ష్మి, అడివయ్యా, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వర్ణ వెంకటరెడ్డి, గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, జి.బీమాసాహెబ్‌, పూజ, అజయ్‌, సురేష్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top