హత్య కేసులో ఒకరి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

హత్య కేసులో ఒకరి అరెస్ట్‌

Nov 24 2026 1:36 AM | Updated on Nov 24 2026 1:36 AM

నిజామాబాద్‌ రూరల్‌: రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కాలూరు శివారులో 15 రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు రూరల్‌ ఎస్‌హెచ్‌వో శ్రీధర్‌ రెడ్డి సోమవారం తెలిపారు. 15 రోజుల క్రితం కృష్ణకుమార్‌ సదా అనే వ్యక్తి హత్యకు గురికాగా, పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సుబోత్‌ కుమార్‌కు కృష్ణకుమార్‌కు గంజాయి విషయంలో వివాదం తలెత్తింది. దీంతో కౌశల్‌, సుజిత్‌ అనే వ్యక్తులతో కలిసి పథకం ప్రకారం కృష్ణకుమార్‌ను హత్య చేసినట్లు వెల్లడించారు. ఖానాపూర్‌ ఎక్స్‌ రోడ్‌ వద్ద నిందితుడు సుబోత్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. హత్య అనంతరం పరారయ్యేందుకు ఉపయోగించిన ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement