అక్రమాలపై విచారణ చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

అక్రమాలపై విచారణ చేపట్టాలి

Nov 24 2026 1:36 AM | Updated on Nov 24 2026 1:36 AM

అక్రమాలపై విచారణ చేపట్టాలి

దోమకొండ బాలికల గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టాలని తెలంగాణ గురుకులాల పేరెంట్స్‌ అసోసియేషన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నెల 9న కూరలో పురుగులు రావడంతో విద్యార్థినులు వాంతులు చేసుకున్నారని, ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పవద్దని ప్రిన్సిపల్‌, వైస్‌ ప్రిన్సిపల్‌లు తెలిపారు. దసరా సెలవులకు వెళ్లే విద్యార్థుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా రూ.200 చొప్పున నగదు వసూలు చేశారని, టీచర్లు ఫోన్లు మాట్లాడుతూ సరిగ్గా బోధన చేయడం లేదని ఫిర్యాదులో పెర్కొన్నారు. అలాగే నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతినెలా పంపే రూ.30 వేలను దుర్వినియోగం చేస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement