ఎల్లారెడ్డి/ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి రెండు ఫిర్యాదులు వచ్చినట్లు ఆర్డీవో ప్రభాకర్ తెలిపారు. రెవెన్యూ శాఖకు సంబంధించి రెండు ఫిర్యాదులు వచ్చాయి. అన్ని శాఖల అధికారులు హాజరైనట్లు ఆయన తెలిపారు.
ఎంపీడీవో కార్యాలయంలో...
ఎల్లారెడ్డి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెండు ఫిర్యాదులు వచ్చినట్లు ఎంపీడీవో తాహేరాబేగం తెలిపారు. రెవెన్యూ శాఖకు సంబంధించి రెండు ఫిర్యాదులు వచ్చాయి.


