సంగోజీవాడి సర్పంచ్‌పై విచారణ చేయించాలి | - | Sakshi
Sakshi News home page

సంగోజీవాడి సర్పంచ్‌పై విచారణ చేయించాలి

Nov 24 2026 1:36 AM | Updated on Nov 24 2026 1:36 AM

సంగోజీవాడి సర్పంచ్‌పై విచారణ చేయించాలి

తాడ్వాయి మండలం సంగోజీవాడి గ్రామ పంచాయతీకి సంబంధించిన పన్ను డబ్బులను సర్పంచ్‌ దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రెండు నెలల క్రితం గ్రామానికి చెందిన గొడబోయిన రాజుగౌడ్‌ వద్ద రూ.30 వేలు వసూలు చేసి, రసీదు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ నెల 6న జరిగిన గ్రామసభలో ప్రశ్నించగా ఆ డబ్బులు ట్రెజరీ ఖాతాలో వేయలేదని, తన వద్దే ఉన్నాయని సర్పంచ్‌ ఒప్పుకుని దురుసుగా మాట్లాడారని తెలిపారు. గ్రామ నిధులను దుర్వినియోగం చేసిన సర్పంచ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement