● గజ్యానాయక్తండా చౌరస్తాలో
సెంట్రల్ లైట్లు లేక తరచుగా ప్రమాదాలు
మాచారెడ్డి: మండలకేంద్రంలోని జూనియర్ కళాశాల నుంచి గజ్యానాయక్ తండా చౌరస్తా వరకు నాలుగు లైన్ల రోడ్డును విస్తరించారు. ప్రమాదాలు చోటు చేసుకోకుండా డివైడర్ నిర్మించినప్పటికి సెంట్రల్ లైట్లు ఏర్పాటు చేయలేదు. దీంతో డివైడర్ కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో తరచుగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.ఇటీవల ఓ భారీ వాహనం డివైడర్ను ఢీకొనడంతో వాహనంలో ఉన్న వాళ్లు స్వల్ప గాయాలతో బయట పడ్డారు.అలాగే ఓ కారు డివైడర్ ను ఢీకొని బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి.ఈనెల 14న వేకువ జామున హార్వెస్టర్ ఢీకొని ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికీ గాయాలయ్యాయి.లైట్లు ఏర్పాటు చేయకున్నా కనీసం రేడియం స్టిక్కర్లు అతికించాలని వాహనదారులు కోరుతున్నారు. అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


