చెరువులో పడి యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

చెరువులో పడి యువకుడి మృతి

Nov 21 2026 2:44 AM | Updated on Nov 21 2026 2:44 AM

సదాశివ నగర్‌ (ఎల్లారెడ్డి): మండలంలోని అడ్లూర్‌ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఒక వ్యక్తి పడి మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై పుష్పరాజ్‌ తెలిపిన వివరాలు ఇలా.. అడ్లూర్‌ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన ఎడ్ల నర్సింలు (34) అనే వ్యక్తి ఈనెల 19న ఉదయం గ్రామ శివారులో గల గోదాముల్లో పనిచేయడానికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. రాత్రయిన అతడు ఇంటికి తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విచారించగా, అతడు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు, ఫైర్‌ సిబ్బంది చెరువులో గాలింపు చేపట్టగా, అతడి మృతదేహం లభ్యమైంది. మృతుడికి నరసింహులు భార్య సాయి వెన్నెల, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల చిన్నకుమార్తె నామకరణోత్సవం నిర్వహించి, సంతోషంలో ఉన్న ఆ కుటుంబంలో నర్సింలు మృతితో విషాధచాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.

తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు..

జక్రాన్‌పల్లి: మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ఓ గీతకార్మికుడు ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుంచి పడి మృతిచెందాడు. జక్రాన్‌పల్లి ఎస్సై మహేశ్‌ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన ముసలాపురం వేణుగోపాల్‌గౌడ్‌(42) ఈనెల 19న కల్లు గీయడానికి తాటిచెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆర్మూర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం మరణించాడు. మృతుడికి భార్య స్వప్న, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

దుబాయ్‌లో గుండెపోటుతో మారంపల్లి వాసి..

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): మండలంలోని మారంపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దుబాయ్‌లో గుండెపోటుతో మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన గొర్రెపల్లి తుకారాం (47) కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కానీ స్థానికంగా వచ్చే ఆదాయం సరిపోక, అప్పులు చేసి మరీ ఉపాధి నిమిత్తం 18 నెలల క్రితం దుబాయ్‌ వెళ్లాడు. అక్కడ ప్లంబర్‌గా పనిచేస్తుండగా ఈనెల 15న పని ప్రదేశంలో ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకులి మృతిచెందాడు. ఎప్పటికై నా తిరిగి వచ్చి తమ భవిష్యత్తును బంగారుమయం చేస్తాడని ఆశగా ఎదురుచూస్తున్న ఆ కుటుంబానికి, తుకారాం మరణవార్త పిడుగుపాటులా మారింది. శుక్రవారం మృతదేహం స్వగ్రామానికి చేరుకోగా, పెద్దదిక్కును కోల్పోయి కుటుంబసభ్యులు బోరున విలపించిన దృశ్యాలు గ్రామస్తులను కలచివేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement