బాన్సువాడ : బాన్సువాడ మండలం తిర్మాలాపూర్ క్యాంపు(కొత్తాబాది) ఉన్నత పాఠశాలకు ప్రహరి లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పాఠశాలలో 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలకు ఆనుకుని చుట్టూ విశాలమైన స్థలం ఉన్నప్పటికి ప్రహరీ నిర్మించకపోవడంతో వానరాలు, కుక్కలు, పశువులు ఈ స్థలంలో స్వైర విహారం చేస్తున్నాయి. వానరాలైతే విద్యార్థుల వెంట పడి మరి భయపెడుతున్నాయి. గ్రామానికి చెందిన కొందరు రైతులు ఈ స్థలంలోనే ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు. అధికారులు పాఠశాలకు ప్రహరీ నిర్మించేందుకు కృషి చేయాలని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


