బతుకమ్మ ఆటతో జీజీహెచ్‌ కార్మికుల నిరసన | - | Sakshi
Sakshi News home page

బతుకమ్మ ఆటతో జీజీహెచ్‌ కార్మికుల నిరసన

Nov 19 2026 3:01 AM | Updated on Nov 19 2026 3:01 AM

కామారెడ్డి టౌన్‌: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌ ముందు ఆస్పత్రి కార్మికులు నిరసన తెలిపారు. ఏఐటీయూసీ, తెలంగాణ మెడికల్‌ ఎంప్లాయీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో బుధవారం ఆస్పత్రి ముందు బతుకమ్మ ఆటపాటలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు పి. బాలరాజ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్‌. దశరథ్‌ మాట్లాడుతూ.. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఎం. ప్రవీణ్‌, ప్రభుత్వ ఆసుపత్రి కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కె. శ్రీనివాస్‌, తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement