మద్యం మత్తులో ఒకరి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో ఒకరి ఆత్మహత్య

Nov 19 2026 3:01 AM | Updated on Nov 19 2026 3:01 AM

నాగిరెడ్డిపేట: మద్యం మత్తులో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న నాగిరెడ్డిపేట మండలం జలాల్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఎస్సై అగస్త్య భార్గవ్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెంది బాంచ సంగయ్య(42) కూలి పనిచేస్తు జీవించేవాడు. కొంత కాలంగా తాగుడుకు బానిసయ్యాడు. ఈ విషయమై భార్య నిలదీయంతో గొడవలు జరిగాయి. దీంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఒంటరిగా ఉంటున్న సంగయ్య మద్యం మత్తులో మంగళవారం రాత్రి తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

అనారోగ్య సమస్యలతో ఒకరు..

నిజామాబాద్‌ అర్బన్‌: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలోని సంతోష్‌నగర్‌లో చోటు చేసుకుంది. ఐదో టౌన్‌ ఎస్సై సునీల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్‌నగర్‌కు చెందిన సురేశ్‌ (53) అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. పలు ఆస్పత్రుల్లో చూయించినా నయం కాలేదు. దీంతో బుధవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement