మాక్లూర్: మండలంలోని మాణిక్‌బండార్ శివారు ఆర్టీసీ కాలనీ వద్ద రహదారిపై బుధవారం కారును మక్కల లారీ ఢీకొన్నది. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. లారీ డ్రైవర్‌తో ఘర్షణకు దిగడంతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానికులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమనిగింది.
రెండు బైకులు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు
మాక్లూర్: మండల కేంద్రంలోని నందిపేట రహదారిపై రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరి కాళ్లు చేతులు విరిగాయి. స్థానికులు గాయపడ్డ వ్యక్తులను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని మాక్లూర్ పోలీసులు తెలిపారు.


