సర్‌ పెండింగ్‌ ఫారాలను త్వరగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సర్‌ పెండింగ్‌ ఫారాలను త్వరగా పరిష్కరించాలి

Nov 19 2026 3:01 AM | Updated on Nov 19 2026 3:01 AM

బాన్సువాడ : పెండింగ్‌లో ఉన్న సర్‌ ఫారాలను త్వరగా పరిష్కరించాలని ఆర్డీవో రవీందర్‌రెడ్డి సూచించారు. బుధవారం బాన్సువాడ ఆర్డీవో కార్యాలయంలో వివిధ పార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్‌ నోటీసులకు స్పందించని వారు నియోజకవర్గంలో 20 వేల మందికి పైగా ఉన్నారని, వారందని మళ్లీ నోటీసులు జారీ చేయడం జరుగుతుందన్నారు. 15 డిసెంబర్‌ వరకు అవకాశం కల్పించనున్నట్లు, ఫైనల్‌ ఓటర్‌ డ్రాప్ట్‌ పబ్లికేషన్‌ డిసెంబర్‌ 22 వరకు ఉంటుందని అన్నారు. తహసీల్దార్‌ రాజా నరేందర్‌గౌడ్‌, డిప్యూటి తహసీల్దార్‌ సంగమేశ్వర్‌, వివిధ పార్టీల నాయకుల కోనాల గంగారెడ్డి, రమేష్‌యాదవ్‌, లయక్‌, శంశోద్దీన్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement