● రేపు సిద్దిపేటలో సీఎం చేతుల
మీదుగా ప్రారంభం
● వీసీలో సీఎస్ సంజయ్ జాజు
కామారెడ్డి రూరల్: ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకా న్ని సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారుల ను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో ఆయన సమీ క్ష నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అధికారులు వీసీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ కు టుంబంలో సంపాదించే వ్యక్తి ఆకస్మికంగా మరణి స్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్ష ణ కల్పించడమే ఈ పథక ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ పథకాన్ని గురువారం సిద్దిపేటలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి కు టుంబంలో 18–59 ఏళ్ల వయసున్న సంపాదించే ఒ క వ్యక్తిని బీమా పరిధిలోకి తీసుకోవాలన్నారు. ఒక రి కన్నా ఎక్కువ మంది ఉంటే ఎవరిని ఎంపిక చే యాలో కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవచ్చు అ న్నారు. ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. గ్రామాలు, వార్డుల్లో సహాయక నమోదు శిబిరాలు ఏర్పాటు చేయాలనీ, రేషన్ కార్డులు లేని వారికి కూడా ప్రత్యేక దరఖాస్తుల ద్వారా అవకాశం కల్పిస్తామని, మీసేవ కేంద్రాల ద్వారా కూడా నమో దు చేసుకోవచ్చని సీఎస్ తెలిపారు. వీసీ అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ జిల్లాలో అ మలుకు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)ను నో డల్ అధికారిగా నియమించామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోలు, పట్టణాల్లో ము న్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో నమోదు ప్రక్రియ సాగుతుందన్నారు. ప్రతి శిబిరంలోనూ ఇంటర్నెట్, ప్రింటర్, స్కానర్ వంటి సాంకేతిక సదుపాయాలు ఏ ర్పాటు చేశామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ అవగాహ న కల్పించి వంద శాతం నమోదు పూర్తి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, సీపీవో జి.రఘునందన్ పాల్గొన్నారు.


