భూవివాద రహిత గ్రామంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

భూవివాద రహిత గ్రామంగా ఉండాలి

Nov 19 2026 3:01 AM | Updated on Nov 19 2026 3:01 AM

ఎల్లారెడ్డిరూరల్‌/బాన్సువాడ రూరల్‌/నస్రుల్లాబాద్‌/పిట్లం : ప్రతి గ్రామం భూవివాద రహిత గ్రామంగా ఉండాలని ఆర్డీవో ప్రభాకర్‌ అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి మండలం మల్లయ్యపల్లి గ్రామంలో భూభారతి రీ సర్వే కార్యక్రమానికి సంబంధించిన నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. భూ సమస్యల పరిష్కారం కోసం అధికారులకు రైతులు సహకరించాలని అన్నారు. తహసీల్దార్‌ ప్రేమ్‌కుమార్‌, సర్పంచ్‌ లక్ష్మి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.నస్రుల్లాబాద్‌ మండలంలో దుర్కి, దుర్గంపల్లి శివారులో చేపట్టిన సమగ్ర భూ రీ సర్వే పనులను బాన్సువాడ ఆర్డీవో బుధవారం రవీందర్‌ పరిశీలించారు.తహసీల్దారు సువర్ణ, అధికారులు పాల్గొన్నారు. బాన్సువాడ మండలం వాసుదేవుపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూముల రీసర్వే పనులను ఆర్డీవో రవీందర్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాన్సువాడ గిర్దావర్‌ అలీమ్‌, కొల్లూర్‌ సర్పంచ్‌ నాందేవ్‌, సర్వేయర్‌ మధు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. పిట్లం మండలం హస్నాపూర్‌ గ్రామంలో భూ రీసర్వే లో భాగంగా గ్రామ హద్దులను నిర్ధారించారు. తహసీల్దార్‌ మహేందర్‌ కుమార్‌ ఆధ్వర్యంలో, రెవెన్యూ సిబ్బంది గ్రామ హద్దులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారణ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement