పోటెత్తిన బాలవాణి | - | Sakshi
Sakshi News home page

పోటెత్తిన బాలవాణి

Nov 17 2026 1:20 AM | Updated on Nov 17 2026 1:20 AM

పోటెత్తిన బాలవాణి విశేష స్పందన..

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: పిల్లల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ప్రజావాణి సక్సెస్‌ అయ్యింది. సోమ వారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పిల్లలు తరలివచ్చారు. చా లామంది తమ స్కూళ్లలో సమస్యలను ఏకరువు పెట్టా రు. కొందరు పిల్లలు తమ గల్లీ సమస్యలను విన్నవించారు. ఇంకొందరు తమకు ఆధార్‌కార్డు లేదని, ఆధా ర్‌ కార్డులో తప్పులు ఉన్నాయని, తండ్రి చనిపోతే డెత్‌ సర్టిఫికెట్‌ రాలేదని, వైకల్యంతో ఉన్నా పింఛన్‌ రా వడం లేదని ఫిర్యాదులు సమర్పించారు. మొత్తం 148 ఫిర్యాదులు నమోదయ్యాయి. పాల్వంచకు చెందిన కావ్య తన ఇద్దరు కవల పిల్లలతో కలిసి బాల ప్రజావాణికి వచ్చింది. తన భర్త చనిపోయాడని, వితంతు పింఛన్‌ ఇప్పించాలని, పిల్లలకు స్కాలర్‌షిప్స్‌ అందించా లని కోరింది. అలాగే మనవడిని ఎత్తుకుని ప్రజావాణికి వచ్చిన గాంధారి మండలం పేట్‌సంగెం గ్రామానికి చెందిన కిష్టవ్వ.. తన కుమారుడు చనిపోయాడని తెలిపింది. మనవడికి ఆధార్‌ కార్డు ఇప్పించాలని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరింది.

పిల్లల ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పిల్లలతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. చిన్న పిల్లలను ఎత్తుకుని వారికి కేక్‌ తినిపించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పిల్లలు అందించిన వినతులను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. బాలలకు సంబంధించిన సమస్యలను ఎవరైనా నిర్భయంగా అధికారుల దృష్టికి తీసుకురావచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్‌, ఎన్‌వై గిరి, జెడ్పీ సీఈవో చందర్‌, డీఆర్‌వో పాండు, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి వెంకటేశ్‌, డీఎంహెచ్‌వో వెంకట్‌, డీటీడబ్ల్యూవో సౌజన్య, డీఈవో మల్లికార్జున్‌, డీఆర్‌డీవో దామోదర్‌, డీసీపీవో స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

148 ఫిర్యాదులు నమోదు

స్కూల్‌తోపాటు

సామాజిక సమస్యలపైనా...

కుటుంబ కష్టాలనూ

విన్నవించిన పలువురు..

పిల్లల సమస్యలను శ్రద్ధగా

ఆలకించిన కలెక్టర్‌, అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement