హరీశ్‌రావు అవినీతి నిగ్గు తేల్చాల్సిందే | - | Sakshi
Sakshi News home page

హరీశ్‌రావు అవినీతి నిగ్గు తేల్చాల్సిందే

Nov 17 2026 1:20 AM | Updated on Nov 17 2026 1:20 AM

● కాంట్రాక్ట్‌లు, కమీషన్లు తప్ప

సీఎంకు ప్రజల బాధలు పట్టవా?

● తెలంగాణ రక్షణ సేన చీఫ్‌

కల్వకుంట్ల కవిత

నిజామాబాద్‌అర్బన్‌: మాజీ మంత్రి హరీశ్‌రావు అ వినీతిపై నిగ్గు తేల్చాల్సిందేనని తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. ఆయ న చేసిన అవినీతిపై ప్రజాక్షేత్రంలోనే కాకుండా చట్టపరంగా, న్యాయపరంగా ఉన్న అన్ని మార్గాల ద్వా రా పోరాటం చేస్తామన్నారు. సోమవారం ఆమె నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. హరీశ్‌రావు అవినీతికి సంబంధించి అన్ని ఆధారాలను సీబీసీఐడీ కి, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌కు పంపిస్తామన్నారు. ఎల్‌ నినో కారణంగా రాష్ట్రంలో కరువు పరిస్థితులుంటే సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇటీవల ప్రధాని మోదీని కలిసిన ఆయన కనీసం ఈ అంశంపై మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. పంటలు వేయకపోతే రైతులకు ఎకరాకు రూ. 25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement