భిక్కనూరు: విద్యాభివృద్ధికి అవసరమైన ఏ సాయమైనా అందిస్తానని ప్రముఖ వ్యాపారవేత్త, ఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం భిక్కనూరు మండలంలోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్‌క్యాంపస్‌లో ఆయన తన సొంత నిధులతో బోరు బావుల తవ్వకానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ముందుకు వెళ్తే వారి భవిష్యత్తు బంగారుమయం అవుతుందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సేవా కార్యక్రమాలపైనా దృష్టి సారించాలన్నారు. బాగా చదివి దేశాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. తాను విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని, తన సంపాదనలో కొంత భాగాన్ని ఇందుకోసం కేటాయిస్తున్నానని పేర్కొన్నారు. ఆర్థిక స్థోమత లేని నిరుపేదల ఉన్నత చదువులకు సహకారం అందిస్తానన్నారు. విద్యార్థులకు క్రికెట్ కిట్లను అందించారు. ఈ సందర్భంగా సుభాష్‌రెడ్డిని కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్‌గౌడ్‌తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు సన్మానించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి, అధ్యాపకులు యాలాద్రి, సునీత, సరిత, నారాయణగుప్తా, సబిత, అంజయ్య, మోహన్‌బాబు, ప్రతిజ్ఞ, హరిత, నాగరాజు, రమదేవి, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.


