‘బాధితులకు న్యాయం చేయాలి’ | - | Sakshi
Sakshi News home page

‘బాధితులకు న్యాయం చేయాలి’

Nov 17 2026 1:20 AM | Updated on Nov 17 2026 1:20 AM

‘బాధితులకు న్యాయం చేయాలి’ వేతనాలను విడుదల చేయాలి మహిళా కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి కనీస వేతనం అందించాలి

నిజాంసాగర్‌(జుక్కల్‌): పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం చేస్తూ నేరస్తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ రాజేశ్‌ చంద్ర సూచించారు. ప్రతి ఫిర్యాదుపై బాధ్యతాయుతంగా స్పందించాలన్నారు. సోమవారం జుక్కల్‌ పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ నేరాల నియంత్రణ కోసం బీట్‌ సిస్టంను మరింత పటిష్టం చేయాలని సూచించారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. బ్లూకోల్ట్స్‌, పెట్రోలింగ్‌ వాహనాలతో నిరంతరం గస్తీ నిర్వహించాలన్నారు. వ్యక్తిగత ఆరోగ్యంపైనా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఆయన వెంట బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి, బిచ్కుంద సీఐ రవికుమార్‌, జుక్కల్‌ ఎస్సై మురళి ఉన్నారు.

కామారెడ్డి టౌన్‌ : డిమాండ్ల సాధన కోసం నెలరోజులకుపైగా చేసిన సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను విడుదల చేయాలని జాతీయ ఆరోగ్య మిషన్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు డీఎంహెచ్‌వో వెంకట్‌ను కోరారు. సోమవారం డీఎంహెచ్‌వోను కలిసి సమ్మె విరమణ పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు సుమన్‌ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఇచ్చిన గడువులోపు సమస్యలను పరిష్కరించకపోతే మళ్లీ సమ్మెకు దిగుతామన్నారు. సమ్మె కాలంలో సహకరించినందుకు డీఎంహెచ్‌వోను ఉద్యోగులు సన్మానించారు. కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు వైద్యులు మారుతి, హరీశ్‌, పద్మజ, వెంకటరమణ, వేణుమాధవ్‌, మౌనిక, అశ్విని, కళ్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్‌: జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం ఇందుప్రియ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తనకు పార్టీ అప్పగించిన బాధ్యతకు పూర్తి న్యాయం చేస్తానన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ఎస్సీ సెల్‌ మహిళా కార్యదర్శి మమత, నాయకులు లావణ్య, సుగుణ, మాధవి, నిత్య, శిరీష, గీత, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్‌: కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి (జీజీహెచ్‌) వద్ద కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు. ఏఐటీయూసీ, మెడికల్‌ ఎంప్లాయీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు బాలరాజు, మెడికల్‌ ఎంప్లాయీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకుడు దశరథ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు లు, పేషెంట్‌ కేర్‌, శానిటేషన్‌ కార్మికులకు తక్షణమే వేతనాలు పెంచాలన్నారు. సమాన పనికి సమాన వేతనం విధానాన్ని అమలు చే యాలన్నారు. కాంట్రాక్ట్‌ వ్యవస్థను రద్దు చేసి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు, కార్మికులు సునీత, ఫాజియా, రాములు, నర్సింలు, లక్ష్మి, రఫీక్‌, రజిత, వాసవి, సత్యం, రాజయ్య, పద్మ, వెంకటలక్ష్మి, సావిత్రి, గంగాధర్‌, కనకలక్ష్మి, విజయ, స్రవంతి, భాస్కర్‌, సతీష్‌, అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement