● వీసీలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీహరి
కామారెడ్డి టౌన్: వచ్చే నెల 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’లో విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో పాల్గొని పోటీలను విజయవంతం చేయాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. క్రీడల నిర్వహణ, విస్తృత ప్రచారం, ప్రజల భాగస్వామ్యం తదితర అంశాలపై సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా యువతలో క్రీడా స్ఫూర్తి, ఆసక్తి మరింత పెంపొందుతాయని అన్నారు. జాతీయస్థాయి క్రీడా పోటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతోపాటు, రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని పెంపొందించేందుకు అన్నిశాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వీసీలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలాదేవి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ ఎన్.వై.గిరి, జిల్లా యువజన, క్రీడల అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్, డీఈవో మల్లికార్జున్, డీఎంహెచ్‌వో వెంకట్, డీటీడబ్ల్యూవో సౌజన్య, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం తదితరులు పాల్గొన్నారు.


