మలేషియా జైల్లో తాడ్వాయి వాసి | - | Sakshi
Sakshi News home page

మలేషియా జైల్లో తాడ్వాయి వాసి

Nov 16 2026 12:38 AM | Updated on Nov 16 2026 12:38 AM

● తన భర్తను రప్పించాలని

వేడుకుంటున్న భార్య

తాడ్వాయి: గల్ఫ్‌ ఏజెంట్ల మోసంతో మలేషియా జైల్లో చిక్కుకున్న తన భర్తను విడిపించి స్వదేశానికి రప్పించాలని తాడ్వాయికి చెందిన మౌనిక వేడుకుంటున్నారు. బాధితురాలు ఆదివారం తెలిపిన వివరాలు.. తన భర్త అజ్జపల్లి సురేశ్‌ ఈ ఏడాది జూన్‌లో ఉద్యోగం కోసం మలేషియా వెళ్లాడు. సదాశివనగర్‌కు చెందిన ఏజెంట్‌ సంతోష్‌కు రూ.1.40 లక్షలు చెల్లించి వెళ్లగా, ఉద్యోగ వీసా బదులు టూరిస్ట్‌ వీసాపై పంపినట్లు అక్కడికి వెళ్లాక తెలిసింది. దీంతో జులై 3న మలేషియా పోలీసులు సురేశ్‌ను జైలుకు తరలించారు. విడుదల చేయిస్తానని అక్కడి ఏజెంట్‌ డబ్బులు డిమాండ్‌ చేయడంతో కుటుంబ సభ్యులు మరో రూ.1.70 లక్షలు పంపినా ఫలితం లేకుండా పోయింది. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే మదన్‌మోహన్‌కు, తాడ్వాయి పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని భార్య మౌనిక, తల్లి రామవ్వ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సురేశ్‌ను స్వదేశానికి రప్పించాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement