కామారెడ్డి రూరల్: కామారెడ్డి మండలం క్యాసంపల్లి తండా గ్రామంలో జై జగదాంబ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణ పనులను చేపట్టేందుకు గ్రామ సర్పంచ్ భూక్యా శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు కలిసి ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డిని కలిసి ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందించేందుకు ముందుకు రావడంతో సర్పంచ్, ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.వార్డు సభ్యులు రూప్ సింగ్, మాజీ ఉపసర్పంచ్ గోవింద్, గ్రామ పెద్దలు మాన్ సింగ్, శంకర్, రవి, రాజు, హుస్సేన్, కిషన్, గ్రామ యువకులు గోపాల్, నందు, ప్రవీణ్, జయంధర్ తదితరులు పాల్గొన్నారు.


