బిర్సా ముండా పోరాట స్ఫూర్తి ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

బిర్సా ముండా పోరాట స్ఫూర్తి ఆదర్శం

Nov 16 2026 12:38 AM | Updated on Nov 16 2026 12:38 AM

● గిరిజనుల ఆత్మగౌరవం కోసం కృషి

● బీజేపి జిల్లా అధ్యక్షుడు చిన్నరాజులు

కామారెడ్డి టౌన్‌: బిర్సా ముండా పోరాట స్ఫూర్తి ఆదర్శమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు కొనియాడారు. బిర్సా ముండా జయంతిని పురస్కరించుకొని ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నీలం చిన్న రాజులు మాట్లాడుతూ.. బ్రిటిష్‌ పాలకుల అరాచకాలు, మత మార్పిడులను ఎదిరించి అవిశ్రాంత పోరాటం సాగించిన గిరిజన విప్లవ వీరుడు బిర్సా ముండా అని కొనియాడారు. గిరిజనుల ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ కోసం జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు అన్నారు. నాయకులు, కౌన్సిలర్లు శ్రీకాంత్‌, భానుప్రకాశ్‌, నరేందర్‌రెడ్డి, భూమేశ్‌యాదవ్‌, నరేందర్‌, రాజగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎల్‌హెచ్‌పీఎస్‌ ఆధ్వర్యంలో ..

బిర్సా ముండా జయంతిని లంబాడా హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నునావత్‌ గణేష్‌ నాయక్‌, నాయకులు బాదావత్‌ ప్రవీణ్‌ నాయక్‌, వినోద్‌ చవాన్‌, బద్రి నాయక్‌, మదన్‌లాల్‌, రవీందర్‌ నాయక్‌, ప్రకాష్‌ నాయక్‌, దేవిసింగ్‌ నాయక్‌, లకావత్‌ శ్రీను నాయక్‌, రాజు నాయక్‌, రమేష్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

దుర్కి గిరిజన బాలికల గురుకులంలో..

నస్రుల్లాబాద్‌ : మండలంలోని దుర్కి గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో బిర్సా ముండా జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు సునీల్‌ రాథోడ్‌ మాట్లాడారు. విద్యార్థులకు వ్యాస రచన,చిత్ర లేఖనం,బంజారా సాంస్కృతిక నృత్యాల పోటీలను ఏర్పాటు చేశారు. విజేతలకు బహుమతులను అందించారు. కానిస్టేబుల్‌ బుజ్జి, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement