మద్నూర్ మండలాన్ని నిజామాబాద్ జిల్లాలో కలపాలని గ్రామస్తులు ఆదివారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు వినతి పత్రం అందించారు. గతంలో నిజామాబాద్ జిల్లాలో ఉన్న మద్నూర్ మండలాన్ని కామారెడ్డి జిల్లాలో కలపడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మండల ప్రజల కోరిక మేరకు నిజామాబాద్ జిల్లాలో కలపాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఉన్నారు.
శ్మశాన వాటిక నిర్మాణానికి భూమి పూజ
మండల కేంద్రంలోని ముస్లిం శ్మశాన వాటిక నిర్మాణానికి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. రూ.15 లక్షలతో నిర్మాణ పనులు చేపడుతన్నామన్నారు. సర్పంచ్ ఉష, మైనారిటీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలున్నారు.


